✿✿✿ మే-డే - భారతదేశ కార్మిక హక్కులు - శ్రామిక ఉద్యమాల సూరీడు - బాబాసాహెబ్ అంబేద్కర్
మే-డే లేక., ప్రపంచ కార్మిక దినోత్సవం.., శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా, వ్యాపార విలువలతో కాకుండా మానవ విలువలతో కూడిన పని వాతావరణం కోసం, మెషీన్ల ప్రపంచంలో మానవ హక్కుల సాధన కోసం, ప్రపంచ కార్మిక కర్షక సమాజం ఏకమై, ఐక్యమై పిడికిలి బిగించిన రోజు.. "ప్రపంచ కార్మికులారా ఏకం కండి" అని నినదించిన రోజు..
✿✿ పెట్టుబడిదారీ - కార్మిక వర్గాల అవిర్భావం ✿✿
పెట్టుబడిదారీ వర్గం :- ఇంగ్లాండులో మొదలైన పారిశ్రామిక విప్లవం ఉత్పాదనను "అవసరం"గా కాకుండా "వ్యాపారం"గా మార్చినది., ప్రపంచ సంపద మీద ఆధిపత్యన్ని సాధించే లక్ష్యంతో పెట్టుబడిదారి వర్గం ఉద్భవించినది .,
--- పోగేసిన సంపదలతో ప్రభుత్వాలను చూపుడు వేళ్ళతో శాసించడం మొదలుపెట్టింది., తమ వ్యాపార ప్రయోజనాల కోసం ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసి, ప్రజలకు "అవసరాలను శృష్టించడం" మొదలు పెట్టింది.. శృష్టించిన అవసరాలను లాభాలుగా మార్చుకునేందుకు కార్మికుల శ్రమను ఇష్టానుసారంగా దోపిడీ చేయడం మొదలెట్టింది..
కార్మిక వర్గం:- సాంప్రదాయ ఉపాధి వనరుల మీద ప్రకృతి వైపరిత్యాల వంటి బాహ్య కారకాల వలన రాబడి కోల్పోవడం, ప్రభుత్వల విధానాలు సహాయకరంగా కాకుండా నిరుత్సాహ పరిచే విధంగా ఉండడం., సంవత్సరాంతం ఉపాధి దొరుకుతుండడంతో, మరో దారి లేక ఉపాధి కోసం పరిశ్రమల మీద ఆధార పడే పరిస్థితిల్లోకి ఉత్పత్తి(శ్రామిక)వర్గాలు నెట్టబడడంతో కార్మిక వర్గం ఆవిర్భవించినది..
**-- ప్రభుత్వ విధానాలు పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాలకు అనుకూలంగా ఉండడంతో, ఉత్పత్తి వర్గం, ఒక పక్క కార్మికులుగా మరో పక్క వినియోగదారులుగా ద్విపాత్రాభినయం చేయాల్సి వచ్చింది..
** తమ వినియోగం కోసం, తామే చేస్తున్న ఉత్పత్తికి చాలీ చాలని వేతనం పొందుతూ, మళ్ళీ వాటిని అధిక ధరలు చెల్లించి పొందడం ద్వారా రెండు వైపుల నుండి దోపిడీకి గురయ్యే విచిత్రమైన పరిస్థితుల్లోకి ఉత్పత్తి వర్గాలను నెట్టడం ద్వారా కించిత్ శ్రమ కూడా చేయకుండానే సంపదలు పోగేసాయి పెట్టుబడిదారీ వర్గాలు..
✿✿ మే-డే చరిత్ర ✿✿
ఒక వైపు కార్మికులుగా శ్రమ దోపిడీకి, మరో పక్క వినియోగదారునిగా ఆర్థిక దోపిడీకి గురి అవుతున్న శ్రామిక వర్గం తీవ్రమైన ఒత్తిడికి గురైనది..
కార్మికుల శ్రమ దోపిడీ చేయడంలో తమలో తామే పోటీపడ్డాయి పెట్టుబడిదారీవర్గాలు..
కార్మికుల శ్రమ దోపిడీ చేయడంలో తమలో తామే పోటీపడ్డాయి పెట్టుబడిదారీవర్గాలు..
తమ శ్రమ ద్వారా సంపదలు పోగేసుకుంటున్న పెట్టుబడిదారలు తమను మనుషుల్లాగా కూడా చూడకపోవడంతో, జీవిన ప్రమాణాలు దుర్భరంగా మారుతుండడంతో తిరుగుబాటు బావుటా ఎగరేసాయి కార్మిక వర్గాలు ., అందులో భాగంగా కార్మికుల మానవ హక్కులకోసం కార్మిక చట్టాల రూపకల్పన కోసం ప్రపంచ కార్మికలోకం గొంతెత్తింది..
☞ అందులో ముఖ్యమైన అంశం, రోజుకు 8 పని గంటలు., మేడే లేక ప్రపంచ కార్మిక దినోత్సవం చరిత్రలో ఈ 8 పనిగంటల నినాదానిదే ప్రముఖ స్థానం ☜
☞ రోజుకు 8 పనిగంటలు నినాదాన్ని మొట్టమొదట తెరమీదకు తీసుకొచ్చినవారు బ్రిటీష్ పారిశ్రామిక విప్లవ కాలానికి చెందిన "జేమ్స్ డేబ్" అనే పెట్టుబడిదారుడు..
☞ ప్రగతిశీల సామ్యవాద భావాలు కలిగిన పెట్టుబడిదారడైన "రాబర్టు ఓవెన్" తన పరిశ్రమలో 1810 నుండి 10 గంటల పని అమలు చేసి, 1817 కల్లా 8 గంటల పనిదినాలు అమలు చేస్తానని ప్రకటించాడు., 8 గంటలు పని - 8 గంటల ఆటవిడుపు - 8 గంటల విశ్రాంతి అనే నినాదానికి విస్తృత ప్రచారం కల్పించాడు ..
☞ ఆగస్టు 1866 లో జనీవాలో జరిగిన "International Workingmen's Association సదస్సు., 8 గంటల పనిదినాన్ని ప్రముఖ లక్ష్యంగా తీర్మాణం చేసింది.
☞ 1884 న చికాగో పట్టణంలో జరిగిన Federation of Organized Trade and Labour Unions, మే 01,1886 నుండి ప్రతి పరిశ్రమ 8 గంటల పని దినాలను ప్రకటించాలని లేకపోతే., కార్మిక సంఘాలు ఐక్యంగా ఉద్యమిస్తామని హెచ్చరించింది..
☞ అయినప్పటికీ పారిశ్రామిక వర్గాలు ఖాతరు చేయకపోవడంతో 01, మే, 1886 న కార్మిక సంఘాలన్నీ సామూహికంగా సమ్మెకు దిగాయి., చికాగో కేంద్రంగా జరుగుతున్న సమ్మెలో Knights of Labor సంఘం ముఖ్య నాయకత్వంలో 80వేల మంది కార్మికులు వీధులకెక్కారు., రెండురోజుల్లో ఈ ఉద్యమం దావానంలా పాకి, ఆ సంఖ్య 3.5లక్షలకు చేరింది.,
☞ మే 03 న శాంతియుతంగా సమ్మె చేస్తూ పరిశ్రమలను మూయిస్తున్న కార్మికులపై పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో హింస చోటు చేసుకోవడం వలన పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు.
☞ మే 04, "హే మార్కెట్ ఉదంతం"(Hay Market Incident):- ముందురోజు జరిగిన పోలీసు కాల్పులకు నిరసనగా కార్మికులు హే మార్కెట్ స్వేర్ వద్ద సమావేశం నిర్వహించారు., ఆ సమావేశంలో అతివాద భావజాలం గలవారు పోలీసుల మీద బాంబు ప్రయోగించడంతో 7గురు పోలీసులు 4గురు సాధారణ పౌరులు దుర్మరణం చెందారు.
☞ ఈ ఘటన మొత్తం ఉద్యమం మీద తీవ్ర ప్రభావం చూపింది., ప్రభుత్వాలు ఉద్యమకారులపై కఠినంగా వ్యవహరిస్తూ, అణచివేత కార్యాచరణను ముమ్మరం చేయడంతో, ప్రతిఘటన కోసం అతివాదులు మితవాదులు ఐక్యం అయ్యారు., దానితో ముక్కలుగా ఉన్న కార్మిక సంఘాలు మునుపెన్నడూ లేనంత బలం సంతరించుకోసాగాయి.,
☞ ఐక్యమైన కార్మిక సంఘాలు American Federation of Labour గా ఏర్పడి 1888 డిసెంబరులో సమావేశమై మే 01, 1890 నుండి కార్మికులంతా తమకు తాముగా 8గంటల పని దినాన్ని పాటిస్తామని ప్రకటించాయి,
☞ 1889 సంవత్సరంలో ప్యారిస్ లో జరిగిన రెండవ International Workingmen's Association సదస్సులో కూడా మే 01,1890 న హే మార్కెట్ ఉదంతంలో ప్రాణ త్యాగం చేసి, కార్మిక సంఘాల ఐక్యతకు బీజాలు వేసిన అమర వీరుల స్మతిలో "అంతర్జాతీయ ప్రదర్శన" నిర్వహించాలని తీర్మాణం చేసి ఆమోదించినది..
☞ ఆ మే 01, 1890 న జరిగిన మొదటి ప్రదర్శనే ఈనాటికిీ "మే-డే" లేక "ప్రపంచ కార్మిక దినోత్సవం"గా మారి ప్రపంచ కార్మిక శక్తిలో హక్కుల సాధనకై ఉద్యమ స్పూర్తిని నింపుతూ వస్తోంది..
✿✿ భారతదేశం - కార్మిక హక్కులు - కార్మికుల ఐక్యత ✿✿
ప్రపంచ కార్మికులు దేశాలకు, జాతులకు, భాషలకూ అతీతంగా ఏకమై హక్కుల కోసం నినదిస్తుంటే, భారతదేశంలో దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉండేవి., జాతీయ వనరులను ఇక్కడి శ్రామికుల శ్రమ ద్వారా ముడి సరుకుగా మార్చి ఇంగ్లాండుకు తరలించి., వాటిద్వారా తయారైన ఉత్పత్తులను మళ్ళీ భారతదేశంలోనే అమ్ముతూ, దేశ సంపదను కొల్లగొట్టింది బ్రిటీష్ వలస ప్రభుత్వం., దీనితో దేశీ ఉత్పత్తి రంగం కూడా కోలుకోలేని విధంగా దెబ్బతిని ఉత్పత్తికులాలు, బ్రిటీష్ కార్ఖానాలలో కూలీలుగా దుర్భరమైన జీవితాలను వెళ్ళదీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
అయినప్పటికీ ఇక్కడి కార్మికులలో చలనం రాలేదు., తిరుగుబాటు వైఖరి పూర్తిగా లోపించింది., దీనికి కారణం కార్మికుల అనైక్యత.. కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశ సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల వ్యవస్థ జాడ్యం ప్రభావం వలన కార్మికశక్తి కులాల ముక్కలుగా విడిపోయి ఉంది., ప్రపంచ కార్మికులను జాతులకు, భాషలకు, సంస్కృతులకు, అతీతంగా ఏకం చేసిన "కార్మిక వర్గ భావన" భారతదేశంలో ఈనాటికీ నిజం కాలేదు..
చివరికి రెండు ప్రపంచ యుద్ధాల కాలంలో ఉత్పత్తి విశిష్టతను అవకాశంగా తీసుకొని ప్రపంచ కార్మిక సంఘాలు, పెట్టుబడిదారీవర్గాల మీద ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి ఎన్నో హక్కులను పొందాయి., కానీ భారతదేశంలో మాత్రం అనైక్యత వలన నామమాత్రం బలంతో ఆ ప్రయత్నం కూడా చేయలేకపోయాయి.,
ఈ అనైక్యతకు కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ విధంగా వివరిస్తారు..
"కుల వ్యవస్థ కార్మికులను వృత్తుల వారిగా మాత్రమే విభజించలేదు., ఇది ఈ కార్మిక వ్యవస్థను ఎన్నటికీ ఐక్యం కాలేని ఒక శ్రేణులవారీ గదులుగా విభజించి, పరస్పరం కలహించుకోవడం వారి బాధ్యతగా నియమం చేసింది"
✿✿❀ బాబాసాహెబ్ అంబేద్కర్ - కార్మిక హక్కులు ❀✿✿
ఈ రకమైన నిస్తేజంలో కొట్టుమిట్టాడుతూ, తమ హక్కులకోసం నోరు తెరచి కూడా అడగలేని పరిస్థితుల్లో, భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన కార్మిక సమాజానికి ఊపిరి పోస్తూ "మెస్సయా" లాగా ఉద్భవించారు బాబాసాహెబ్ అంబేద్కర్..
☞ 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా లభించిన అవకాశాలను కార్మికుల అభివృధ్ధికి వాడుకునే ఆలోచనతో 1936 ఆగస్టులో "ఇండిపెండెంట్ లేబర్ పార్టీ (ILP)" స్థాపించి 1937 ప్రొవిన్షియల్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించి బ్రిటీష్ ప్రభుత్వం ముందు కార్మికుల గొంతు బలంగా వినిపించారు.
☞ కార్మికుల కనీస వేతనాలు, వసతులు, 8 గంటల పనిదినాలు, సాంకేతిక పరిజ్ఞానంపై కార్మికులకు శిక్షణ వంటి అనేక కార్మిక శ్రేయస్సు విధానాలతో పాటు జాగిర్దారీ వ్యవస్థ నిషేధం, ప్రభుత్వ హయాంలోనే పారిశ్రామీకరణ వంటి సామ్యవాద భావనలకై నినదించింది ఇండిపెండెంట్ లేబర్ పార్టీ
☞ జులై 07, 1942న Viceroy Executive Council లో బాబాసాహెబ్ అంబేద్కర్, లేబర్ మెంబర్ గా ప్రాతినిధ్యం వహించడం భారతీయ కార్మిక హక్కుల చరిత్రలో ఒక మైలురాయిగా భావించవచ్చు..
☆లేబర్ మెంబర్ గా బాబాసాహెబ్ కృషి.. సాధించిన విప్లవాత్మక విజయాలు..☆
✓ నవంబరు 27, 1942 న జరిగిన Indian Labour Conference 7వ సమావేశానికి హాజరైన బాబాసాహెబ్ 14 గంటలుగా ఉన్న పనిదినాన్ని 8 గంటలుగా మార్పుచేసి భారతీయ కార్మికులును శ్రమ దోపిడీ నుండి రక్షించారు
✓ కార్మికుల ఆరోగ్య భద్రత కోసం Employee State Insurance(ESI) ప్రారంభించారు., ఈ రకమైన వసతి తూర్పు ఆసియాలోనే మొదటి కల్పించినది బాబాసాహెబ్
✓ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెరిగే కరువు భత్యం (Dearness Allowance) అందించే వెసులుబాటు కల్పించి ధరల పెరుగుదల ప్రభావం నుంచి రక్షణ కల్పించారు
✓ కార్మికులు రిటైర్ అయ్యాక వారి భవిష్యత్తుకు భద్రత కల్పిస్తూ "భవిష్య నిధి" (Provident Fund)ని రూపొందించారు.
✓ కనీస వేతనం ప్రవేశపెట్టి, వాటిని నిర్థిష్ట సమయానికి మళ్ళీ సవరించే విధంగా పే రివిజన్ కమీషన్లను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు.
✓ పని ప్రాంతాలలో కార్మికుల సౌకర్యాల కోసం, Labour Welfare Act తో పాటు ప్రత్యేకించి మహిళల కోసం అనేక చట్టాలు తీసుకొచ్చారు.,
✓ ఈనాడు కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తూన్న బ్యాంకు వ్యవస్థకు ఊతమైన రిజర్వు బ్యాంకు స్థాపనకు ఏర్పాటు చేసిన "హిల్టన్ యంగ్ కమీషన్" పూర్తిగా బాబాసాహెబ్ రాసిన The Problem of Indian Rupee- its origin and Solutionను అనుసరించి 'రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా'ను ఏర్పాటు చేసింది.
✓ నిరుద్యోగులకు ఉద్యగ అవకాశాలను వ్యవస్థీకరించడంలో భాగంగా "ఎంప్లాయమెంట్ ఏక్సచేంజీ"లను స్థాపించారు.
✓ 1926లోనే ఇండియన్ లేబర్ యాక్టు ఉన్నప్పటికీ అది కార్మిక సంఘాలు నమోదుకు మాత్రమే పరిమితం అవడంతో కార్మి సంఘాలు బలహీనంగా మిగిలిపోయేవి., 1943 నవంబరు 8 న బాబాసాహెబ్ ప్రవేశపెట్టిన "Indian Trade Unions bill" కార్మిక సంఘాలకు కొత్త జీవం పోసింది..
✓ కార్మిక - యాజమాన్య సమస్యల పరిష్కారం కోసం Labor Dispute act, Factories act, మరియు సమ్మె హక్కును చట్టబద్ధం చేయడం వంటి ఎన్నో వసతులు బాబాసాహెబ్ కల్పించినవే..


కార్మికుల కోసం నిర్మించే బాత్రూముల గోడలు ఎంత ఎత్తులో ఉండాలి, వారి పని చేసే దగ్గర గోడలకు సున్నాలు ఎంతకాలానికి ఒకసారి మారుస్తూ ఉండాలి లాంటి అతి చిన్న విషయాల మీద కూడా బాబాసాహెబ్ శ్రద్ధ తీసుకోవడం చూస్తుంటే, కార్మికుల హక్కులపై ఆయన చూపిన నిబద్ధత, వారిపై ఆయనకు ఉన్న ప్రేమ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుపుతున్నాయి..
✌
✌


✿✿ బాబాసాహెబ్ కృషి - కమ్మనిస్టు కార్మిక సంఘాల మనువాద పోకడలు ✿✿
-- భారతీయ కార్మిక సామ్యం కోసం బాబాసాహెబ్ అనిర్వచనీయమైన కృషి చేసినప్పటికీ, వారు బాబాసాహెబ్ పేరు తలిచేందుకు కూడా ఇష్టపడక వారి ద్రోహపు బుద్ధిని చూపించుకుంటున్నారు., స్వతంత్రానంతరం కార్మిక ఉద్యమాల మీద పేటెంటు హక్కులు ప్రకటించుకున్న కమ్మనిస్టులే ఈ పోకడలకు పూర్తి బాధ్యులు..
-- ప్రత్యేక నియోజకవర్గాలు ప్రకటించినప్పుడు "హిందూ సమాజం ముక్కలు అవుతుందం"టూ బాబాసాహెబ్ కు అడ్డుపడిన మనువాద గాంధీ లాగానే, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపించిన సమయంలో "కార్మికలోకం ముక్కలు అవుతుందంటూ" ఆర్తనాదాలు చేసారు కమ్మనిస్టులు.,
-- బాబాసాహెబ్ వైస్రాయ్ కౌన్సిల్ కు లేబర్ సభ్యునిగా ఎన్నికైన సమయంలో అంబేద్కర్ బ్రిటీష్ ఏజంటు అంటూ ఆరోపణలు చేసి ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేసారు.,
-- బాబాసాహెబ్ కార్మికుల శ్రేయస్సు కోసం రకరకాల ఆలోచనలు చేస్తుంటే., వీరు మాత్రం భారతీయ సమాజిక పరిస్థితులను పరిగణించకుండా, ఏ దేశపు కమ్యూనిజం ఇక్కడ సమాజంపై రుద్దవచ్చనే అంశంపై తీవ్రమైన తర్జనబర్జనలు పడ్డారు.., వీరి ఈరోజుకు కూడా ఆ తికమక నుండి బయటపడకపోవడం గమనించవచ్చు..
-- మే-డే లేదా ఇతర సందర్భాలలో జిల్లా స్థాయి చిల్లర నాయకులను, చివరికి బూర్జువా పార్టీల నాయకుల పేర్లు కూడా గొప్పగా తలచుకునే కమ్మనిస్టులు, కార్మికులను ఇంతగా ఆదరించిన బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తలవడానికి కూడా మనసొప్పకపోవడం., ఉద్దేశపూర్వకంగా బాబాసాహెబ్ ఉద్యమాన్ని మరుగున పరిచే కుట్రలో భాగమే.,
-- బాబాసాహెబ్ గురించి మాట్లాడితే కులనిర్మూలన గురించి మాట్లాడాలి., కులనిర్మూలనకు వారి మనువాద మనస్తత్వం అంగీకరించక, కులమే లేదని మభ్యపెట్టిన కమ్మనిస్టుల నియో బ్రాహ్మణవాదానికి ఈ 70 ఏళ్ళ ప్రవర్తనే తార్కాణం.
-- కులవ్యవస్థ ప్రభావాన్ని పరిగణించకుండా, కార్మికులలో ఐక్యత తీసుకరావడానికి ప్రయత్నించడంతో, వర్గం అనే భావన భారతదేశ కార్మిక సమాజంలో "విరివిగా ఉపయోగించే అబద్ధం"గా మిగిలిపోవడం అనే వాస్తవాన్ని ఈనాటికీ మన కమ్మనిస్టు సోదరులు ఒప్పుకోకపోవచ్చు..
-- ఈ పోకడలకు కారణం భారతదేశ సామాజిక సమస్యల పునాది కులం అన్న వాస్తవం ఒప్పుకోవడానికి మనువాద మనసు అంగీకరించక, వర్గ స్మరణలో కాలం గడిపే మోసపూరిత మనస్తత్వం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇందుకు ముఖ్య కారణం అగ్రకుల నాయకత్వంలో ఉద్యమాలు నడవడమేనేది తిరుగులేని నిజం
-- ఇప్పుడు మరో గత్యంతరం లేక బాబాసాహెబ్ పేరును భుజానికెత్తుకుంటున్న వీరు.. ఇన్నాళ్ళూ ఉద్దేశపూర్వకంగా బాబాసాహెబ్ పేరుని కూడా ఎత్తకుండా, బాబాసాహెబ్ కృషిని కనీసం తమ అనుచరులకు కూడా తెలియజేయకుండా, సిద్ధాంతాన్ని మరుగున పడేసే ప్రయత్నం చేయడంపై కనీసం తమ పార్టీల కోసం త్యాగాలు చేసిన, చేస్తున్న దళిత కార్యకర్తలకైనా సంజాయిషీ ఇచ్చి తీరాలి..




-- బ్రిటీష్ వలస పాలనకు, వారి దోపిడీలో చేదోడువాదోడుగా ఉండి స్వతంత్రానంతరం దళారీ వ్యవస్థను నిర్మించి, ప్రభుత్వాలు నడిపి దేశ సంస్థను కొల్లగొట్టిన సంస్థలే కార్మిక సంఘాలు పెట్టి, కార్మిక సంఘాల స్థాపన స్పూర్తిని నవ్వులపాలు చేస్తున్న ఈ తరుణంలో.,
-- వందల కొద్దీ చట్టాలు ఉన్నా సరిగా అమలుకు నోచుకోక, హక్కులను నిర్మొహమాటంగా నిరాకరిస్తూ, దోపిడీదారుల పెట్టుబడిదారలు ప్రయోజనాలు కాపాడే దళారీ వ్యవస్థగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న ఈ సమయంలో..
☞☞ సిద్ధాంత భావదారిద్యంలో కొట్టుమిట్టాడుతున్న కమ్యూనిజం భారతదేశానికి చాలదు.. ☜☜








జై భీమ్.!! జై భారత్.!!