సమాజంలో కులం పోయేదాకా
బహుజనులకు ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే
భారతదేశంలో “మనువు” సృష్టంచిన మనుధర్మ శాస్త్ర ప్రకారం ఉద్భవంచిన అతి దుర్మార్గపు వ్యవస్థే “కులవ్యవస్థ”. ఈ కులవ్యవస్థ మనుషులను అనేక కులాలుగా, ఉపకులాలుగా వర్గీకరించి ఒక మనిషిని ఇంకొక మనిషితో కలవకుండా, ఒక కులం వారు ఇంకొక కులం వారిని వివాహం చేసుకోకుండా, ముఖ్యంగా శూద్రులను, అతిశూద్రులను అంటరానితనం,
అసమానత, అక్షరం, అధికారంకు దూరం చేయడం
ద్వార అగ్రకులాలకు
క్రింది కులాలు బానిసలుగా ఉంచే నిచ్చెన మెట్ల కుల సమాజ నిర్మాతనే ఈ నీచ మనువు.
ఈ కులవ్యవస్థను ప్రశ్నిస్తూ భారత్దేశంలో చార్వాకులు, బుద్దుడు, మహాత్మ పూలే, పెరియార్ ఇ.వి రామస్వామి
నాయకర్, నారాయణ గురు, సంత్ రవిదాస్, ఛత్రపతి
సాహూజీ మహారాజ్ మరియు డా బి.ఆర్ అంబేడ్కర్ లాంటి మహానీయులు పోరాటం
చేయడం జరిగంది
“రిజర్వేషన్ల ప్రస్తావన” విషయానికొస్తే దేశంలో మొట్ట మొదటిసారిగా
మహారాష్ట్రలోని కొల్హాపూర్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న శూద్ర కులానికి చెందిన
“ఛత్రపతి సాహూజీ మహారాజ్” గారు
26-04-1902 సం.లో “శూద్రులకు
50% రిజర్వేషన్లను” ప్రవేశపెట్టడం జరిగింది.
అసమానతల సమాజానికి (కులం), అక్షరంరాని కులాలకు ఈ రిజర్వేషన్లు ఎంతో ధైర్యాన్నిచ్చాయి. ఇక్కడ మొదలైన రిజర్వేషన్ల ప్రస్తావన స్వాతంత్ర్యం అనంతరం భారతదేశ రాజ్యాంగంలో
రిజర్వేషన్లు ప్రవేశ పెట్టడానికి డా.బి.ఆర్ అంబేడ్కర్ గారు సాహూజీ మహారాజు గారిని ఆదర్శంగా తీసుకుని అంటరాని వారు,
సామాజిక అణచివేతకు గురికాబడ్డ వాళ్ళు, ఎస్సీ, ఎస్టీలకు మరియు
వెనుకబడిన తరగగతుల వారికి “రిజర్వేషన్లను” రాజ్యాంగంలో పొందుపరచడం జరిగంది.
63 సం.ల స్వాతంత్ర్య భారతదేశంలో ఎస్సీ, ఎస్టీలు రిజర్వేషన్లపై ఆధారపడడానికి ప్రధాన కారణం పాలకుల నిర్లక్ష్య వైఖరి
మరియు అప్పటినుండి ఇప్పటి వరకు దేశాన్ని పరిపాలిస్తున్న వారంతా అగ్ర కులాలవారు కావడం
ప్రధాన కారణం. దీనికి ముఖ్య ఉదాహారణ నూటికి 90% ఉన్న బీసి, ఎస్టీ, ఎస్సీలనుండి
ఒక్క నరేంద్ర మోడీ మినహా అంతకముందు ఒక్కరు కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి కాకపోవడం,
ఒకటి, రెండు రాష్ట్రాలు మినహా ఏ రాష్ట్రంలో కూడా
పై వర్గాల వారు ముఖ్యమంత్రులు కాలేదంటే ఇక్కడ మానవతాధర్మం కాదు అమలు జరుగుతున్నది ముమ్మాటికీ
మను ధర్మం అని స్పష్టం అవుతుంది . ఇకపోతే అగ్రకులాల వారి
వ్యవహారం “రిజర్వేషన్లు మీకు-రాజ్యాధికాకారం
మాకు (జీవితకాలం)” అన్నట్లుంది వారి శైలి.
ప్రభుత్వరంగం పతనమై, ప్రైవేటు రంగం నానాటికీ
విస్తరిస్తున్న ఈ క్రమంలో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అనివార్యం. లేనట్లయితే బీసీ, ఎస్సీ, ఎస్టీల
పరిస్థితి అగమ్య గోచరం అవుతుంది. ఎందుకొరకు ప్రైవేటురంగంలో రిజర్వేషన్లు
ఇవ్వాలంటే ప్రభుత్వం నుండి తక్కువ ధరకు భూమి
కొనుగోలు, ప్రభుత్వపరమైన రోడ్డు, నీరు,
విధ్యుత్, తపాలా రంగం,
కమ్యూనికేషన్ రంగాలను వినియోగించుకుంటారు. ఈ ప్రభుత్వాలు నడిచేదే
ఎస్సీ, ఎస్టీ, బీసీవారు కట్టే అనేక రకాల
పన్నుల నుండి వచ్చే ఆదాయం మరియు వారు వేసే ఓటుపై ఆధారపడి ఉన్నాయి.
ప్రైవేటు రంగంలో పనిచేయాలంటే “ప్రతిభ” ఉండాలంటారు, ఇంతకముందు చెప్పినట్లు 63 సం.లు తెలివితో అగ్ర కులాల వారే ఈ దేశాన్ని పాలించింది,
మరి ఈ దేశం ఎందుకు అభివృద్ధి చెందలేదు? ఉత్పత్తి కులాలు సృష్టించే
సంపదను వారు సృష్టించగలరా? (కుండ, వడ్రంగి,
కంచర, చెప్పులు వంటి ఇతర తయారీలు). అవకాశం కల్పిస్తే ఎవరైనా రాణించగలరు.
కాబట్టి “ప్రైవేటు రంగంలో బీసి, ఎస్టీ , ఎస్సీలకు రిజర్వేషన్లు” అనే అంశానికి అందరూ సహకరిచగలరని విజ్ఞప్తి.
సామాజిక ఉద్యమ జై భీమ్ లతో...
(జనగామ నర్సింగ్)
అడ్వకేట్
రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు,
బహుజన సంక్షేమ సంఘం (BSS),
సెల్: 9949200562